కరోనాపై సినీ తారలు ఏం చెబుతున్నారు?
close
Published : 17/03/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై సినీ తారలు ఏం చెబుతున్నారు?

కరోనా వైరస్‌ నేపథ్యంలో థియేటర్లు మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. సినీ తారలు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు తమ వంతు సాయంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎలా మసలు కోవాలి? ఇంట్లో ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఇలా అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటూ, అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలో కరోనా తీవ్రత పెరగకుండా ఉండేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా పలువురు సినీ నటులు, దర్శకులు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక వీడియో విడుదల చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సూత్రాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జార్జియాలో సినిమా చిత్రీకరణలో ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్ స్టా ద్వారా తన సందేశాన్ని ప్రకటించారు. ప్రజల ఆరోగ్య భద్రతపై ఆలోచించాల్సిన సమయమిదని, ప్రతి ఒక్కరు కరోనా విషయంలో కీలకంగా వ్యవహరించాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి తాళం వేసి సిబ్బందికి సెలవు ప్రకటించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పూరీ కనెక్ట్స్ లో ఎలాంటి ఆఫీసు పనులు, ప్రొడక్షన్ పనులు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ నెల 19న జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను ముందస్తుగానే రద్దు చేసుకున్నారు. అలాగే తన విద్యాసంస్థల వార్షికోత్సవాన్ని కూడా వాయిదా వేసినట్లు ప్రకటించారు. కరోనా వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మానవత్వాన్ని చాటుకొని ఒకరినొకరు కాపాడుకోవాలని తమిళనటుడు విజయ్ సేతుపతి కోరారు. రితో పాటు, అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, కాజల్‌, అదాశర్మ, శిల్పాశెట్టి, సమీరారెడ్డి, అనుపమ్‌ఖేర్‌, సుమ, మంచు మనోజ్‌ ఇలా పలువురు సినీ తారలు తమ అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని