అప్పుడు మాత్రమే థియేటర్‌కు వస్తారు: సురేష్‌ బాబు
close
Published : 26/04/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు మాత్రమే థియేటర్‌కు వస్తారు: సురేష్‌ బాబు

అప్పటి వరకూ కష్టమే..!

చిత్ర పరిశ్రమ మారితేనే మంచి భవిష్యత్తు

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమ విధానాలు మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అన్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం చిత్ర పరిశ్రమపై తీవ్రంగా పడిన సంగతి తెలిసిందే. రూ.కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన సినిమాల విడుదల ఆపుకోవాల్సి వచ్చింది. షూటింగ్‌లు ఆగిపోయాయి. మరోపక్క సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత చిత్ర పరిశ్రమను నెమ్మదిగా మొదలుపెడతాం. ఎందుకంటే భౌతిక దూరంతో షూటింగ్‌ జరపడం సాధ్యం కాదు. థియేటర్‌లో కూడా సామాజిక దూరం పాటించి.. సినిమాలు చూస్తే మంచి అనుభూతిని ఇవ్వలేకపోవచ్చు. మెల్లగా మార్పులు జరుగుతాయి. ఎలా తిరిగి షూటింగ్‌ చేయాలి? ఎలా జనాల్ని థియేటర్‌కు రప్పించాలి? అనే విషయాలు ఆలోచించాలి. 20-30 మందితో కలిసి చిన్న, మీడియం సినిమాల షూటింగ్‌ చేయడం మొదలుపెడతాం. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌లో పరిమిత వ్యక్తులతో చిన్న సినిమాలు తీస్తాం. వీలుంటే ముందుగా వాటిని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేస్తాం’’

‘‘లాక్‌డౌన్‌ ప్రభావం ఎక్కువగా పంపిణీదారులపై పడింది. డిజిటల్‌ పరంగా మేం ఏం చేయగలమో అన్నీ చేస్తాం. ఎవరైనా సరే మార్పుల్ని అంగీకరించాలి. చిత్ర పరిశ్రమ మారితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇన్నాళ్లూ ఓ విధంగా బతికాం.. ఇప్పుడు మారాల్సి పరిస్థితి వచ్చింది. నాకు మరో సంవత్సరం వరకు పెద్దగా పనులు లేవు. ఈ సమయంలో నన్ను నేను భవిష్యత్తు కోసం రెడీ చేసుకుంటున్నా. ఇంట్లో ఉండీ ఉండీ అందరికీ విసుగొచ్చేసింది. కరోనా ఇకలేదు.. అని రేపు ప్రకటించినా అందరూ థియేటర్లు, మాల్స్‌, పబ్‌లకు గుంపులు గుంపులుగా వెళ్లిపోతారు. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ వస్తే థియేటర్లకు ఇంకా డిమాండ్‌ పెరుగుతుంది. భయం వెళ్లిపోయిన తర్వాత మాత్రమే అందరూ థియేటర్లకు వస్తారు. అప్పటి వరకు ఇలానే ఉంటుంది. ఈ సీజన్‌లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ డిమాండ్ బాగా పెరిగింది. కొందరు తమ సినిమాల్ని వీటిలో విడుదల చేయొచ్చు. మరికొందరు థియేటర్లు ప్రారంభం అయ్యే వరకూ ఎదురుచూడొచ్చు. ఇప్పటికే తమిళంలో జ్యోతిక సినిమా విడుదలకు సిద్ధమైంది. దానిపై వివాదం జరుగుతోంది. హిందీలోనూ సినిమాలు విడుదల అవుతున్నాయి. విజయ్‌ సినిమాకు రూ.150 కోట్లు ఖర్చు అయ్యిందట. అదే బడ్జెట్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఇస్తే.. వారికి ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు సిద్ధంగానే ఉంటారేమో. అది సినిమా తీసే వారి ఇష్టం’’

‘హోమ్‌ క్వారంటైన్‌లో వ్యాయామం చేస్తున్నా. కుటుంబ సభ్యులతో ముచ్చట్లు చెప్పుకొంటూ కొత్త పనులు నేర్చుకుంటున్నా. రానా, అభితో ఏదో చెబుతుంటారు వింటుంటా. వాళ్లతోనే ఎక్కువ సమయం గడిచిపోతోంది. స్నేహితుల గ్రూపుల్లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ‘నష్టపోతున్నాం, మళ్లీ ఎప్పుడు కోలుకోవాలి’ అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి రోజుల్ని కథల్లో ఊహించాం కానీ.. నిజంగా వస్తాయి అనుకోలేదు. కరోనా తర్వాత మనం కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. దానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే పాజిటివ్‌గా ఉన్నా. నా రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఒత్తిడి పెట్టుకుని సాధించేది ఏమీ లేదు. మా వీధిలో ఎవరైనా నడుస్తున్నా.. తిడుతున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు సురేశ్‌బాబు.

ఇదీ చదవండి..

సూర్య చిత్రాలపై నిషేధం:థియేటర్‌ యజమానులు

పేద డ్యాన్సర్లకు లారెన్స్‌ సాయం


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని