ఆ రోజులన్నీ గుర్తుకువస్తున్నాయి..:రష్మిక
close
Published : 30/05/2020 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రోజులన్నీ గుర్తుకువస్తున్నాయి..:రష్మిక

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో కుటుంబసభ్యులతో గడపడం ఎంతో సంతోషంగా ఉందని నటి రష్మిక అన్నారు. షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ దొరకడంతో ఇంటికే పరిమితమైన రష్మిక సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘18 ఏళ్ల వయస్సు నుంచి కాలంతోపాటు పరుగెడుతున్నాను. ఒక గమ్యం చేరుకున్న వెంటనే మరో ప్రయాణం మొదలవుతూనే ఉంది. ఈ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు. అలా పరిగెడుతూ ఉండడం నాకు ఇష్టం. నిజం చెప్పాలంటే ఇప్పటివరకూ ఇంత ఎక్కువ సమయం ఇంట్లో గడిపింది లేదు. స్కూల్‌, కాలేజ్‌ లైఫ్‌ అంతా హాస్టల్‌లోనే గడిచిపోయింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను రెబల్‌. నన్ను కంట్రోల్‌ చేయడానికి ఇంట్లోనివారు కొంచెం కఠినంగా ఉన్నట్లు కనిపించేవాళ్లు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక షూటింగ్స్‌లో అమ్మ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకునేవారు. ఆఫీస్‌లో పని త్వరగా పూర్తి చేసుకువచ్చి మాతో సమయం గడిపేందుకు నాన్న ఎంతో ఇష్టపడేవారు. మా చెల్లి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమవడంతో ఆ రోజులన్నీ గుర్తుకువస్తున్నాయి. రెండు నెలలుగా ఇంట్లోనే ఉన్నా. సినిమాలు, వ్యాపారాలు గురించి కాకుండా అమ్మవాళ్లతో సరదాగా మాట్లాడుతున్నా. ఇదే ది బెస్ట్‌. ఇంట్లో ఉంటూ ఇంత సంతోషాన్ని పొందుతానని ఎప్పుడూ అనుకోలేదు.’ అని రష్మిక తెలిపారు.
‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో ఈ ఏడాది ఆరంభంలోనే మంచి విజయాలను రష్మిక తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రానున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని