టిక్‌ టాక్‌ సరదా: పేలిన తుపాకీ
close
Published : 14/01/2020 23:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌ టాక్‌ సరదా: పేలిన తుపాకీ

లఖ్‌నవూ: టిక్‌టాక్‌ సరదా ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. లోడ్‌ చేసిన తుపాకీతో తెలియక వీడియో చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నవాబ్‌గంజ్‌ జిల్లా ముదియా భాయ్‌కాంపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవ్‌(18) అనే యువకుడు సోమవారం కళాశాల నుంచి వచ్చి టిక్‌టాక్‌ వీడియో చేసేందుకు ఇంట్లో ఉన్న లైసన్స్‌ తుపాకీ ఇవ్వమని తన తల్లిని కోరాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె అతడికి రివాల్వర్‌ ఇచ్చి తన పని చూసుకునేందుకు పక్కకు వెళ్లింది. అయితే ఆ తుపాకీ లోడ్‌ చేసి ఉందని ఇంట్లో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో అతడు ఇంట్లో వీడియో చేస్తూ.. తనను తాను కాల్చుకున్నాడు. వెంటనే బయటకు పేలిన శబ్దం వినిపించింది. దీంతో తల్లి ఇంట్లోకి వచ్చి చూసే సరికి ఆ కుర్రాడు రక్తపు మడుగులో పడిఉన్నాడు. వెంటనే ఆమె అప్రమత్తమై కుమారుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని