అంబానీల ముస్తాబు... 
close
Published : 16/05/2020 23:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబానీల ముస్తాబు... 

ముంబయి: అంతర్జాతీయ కుటుంబదినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ కుటుంబానికి చెందిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను అనిల్‌ సతీమణి టీనా పోస్టు చేశారు. వీటిల్లో అనిల్‌ అంబానీ తన కుమారులు అన్మోల్‌, అన్షుల్‌లతో కలసి ఉన్నారు. తండ్రికి కేశాలంకరణ, గడ్డం ట్రిమ్‌ చేసుకోవటం వంటి పనుల్లో వారు సహాయపడ్డారు. అంతే కాకుండా.. ‘‘ప్రపంచం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ సమయంలో, మాకు కుటుంబం విలువ గతంలో కంటే ఎక్కువగా తెలిసివచ్చింది. మీకు ప్రియమైన వారిని దగ్గరకు తీసుకోండి.. ప్రత్యక్షంగా కాకపోతే ఆన్‌లైన్లోనైనా వారితో కలసి సమయం గడపండి.. వారితోనే మీ స్వర్గం... వారే మీ సొంత ప్రపంచం!’’ అని టీనా అంబానీ ఈ సందర్భంగా తెలియజేశారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని