పాక్‌.. ఈ సారి కూడా అలానే కానీ..!
close
Published : 25/06/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌.. ఈ సారి కూడా అలానే కానీ..!

 ఎఫ్ఏటీఎఫ్‌ గ్రేలిస్ట్‌లో కొనసాగింపు

ఇస్లామాబాద్‌: మరోసారి పాక్‌కు ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ వేదికపై ఎదురు దెబ్బ తగిలింది.  ఆ దేశాన్ని గ్రేలిస్టులో కొనసాగించాలని ఎఫ్ఏటీఎఫ్‌ నిర్ణయించింది. పాకిస్థాన్‌ లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ వంటి సంస్థలకు నిధుల రాకను అడ్డుకోవడంలో విఫలమైనట్లు ఎఫ్‌ఏటీఎఫ్ భావించింది. అందుకే గ్రేలిస్టులో కొనసాగిస్తోంది’ అని ఓ అధికారి పీటీఐతో పేర్కొన్నారు.  ఐరన్‌ బ్రదర్‌ చైనా అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఊరట లభించకపోవడం పాక్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం చైనాకు చెందిన జింగ్‌మిన్‌ ల్యూ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. అయినా పాక్‌ను రక్షించలేకపోయారు. దీంతో వచ్చే అక్టోబర్‌ వరకు గ్రేలిస్టులో కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. 

పాక్‌ కొంపముంచిన అమెరికా నివేదిక..

పాక్‌ ఇప్పటికీ ఉగ్రవాదుల స్వర్గంలానే ఉందని ది యూఎస్‌ కంట్రీ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రభావం ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయాన్ని బాగా ప్రభావితం చేసింది. పాక్‌ స్థానిక ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు లష్కరే, జైషే వంటి సంస్థల కార్యకలాపాలకు అనుమతిస్తోందని దానిలో పేర్కొంది.  వీటితోపాటు తాలిబన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి వాటికి కూడా ఆశ్రయం కల్పిస్తోందని పేర్కొంది. 

రుణాలు కష్టమే..
అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్‌కు ఎఫ్‌ఏటీఎఫ్ తాజా నిర్ణయం పిడుగుపాటుగా మారింది. ఈ నిర్ణయంతో ఇప్పట్లో పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంక్‌, ఆసియాన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ల నుంచి తేలిగ్గా రుణాలు లభించే పరిస్థితి లేదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత దిగాజార్చనుంది. అక్టోబర్‌ నాటికి ఎఫ్‌ఏటీఎఫ్‌ విధించిన లక్ష్యాలను చేరుకోలేకపోతే పాక్‌ను బ్లాక్‌ లిస్టులో చేర్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని