హార్లీపై భారత ప్రధాన న్యాయమూర్తి!
close
Published : 29/06/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హార్లీపై భారత ప్రధాన న్యాయమూర్తి!

దిల్లీ: అత్యాధునిక బైక్‌పై కూర్చున్న ఈ వ్యక్తిని గమనించారా.. ఎవరా..? అని ఆలోచిస్తున్నారా? ఆయన అత్యంత క్లిష్టమైన కేసుల్లో చారిత్రాత్మిక తీర్పులు వెలువరించిన భారత ప్రధాన న్యాయమూర్తి శరద్‌ అరవింద్‌ బోబ్డే. ఆయన హర్లే డేవిడ్సన్‌ సంస్థకు చెందిన సీవీఓ 2020 లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనంపై జస్టిస్‌ బోబ్డే కూర్చుని ఉన్న చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాగా, ఈ వాహనం విలువ రూ.51లక్షలకు పైమాటే.  2000సీసీ వీ ట్విన్‌ ఇంజన్‌తో కూడిన ఈ భారీ వాహనం బరువు 400 కిలోలకు పైగా ఉంటుంది. అయితే ఈ వాహనం న్యాయమూర్తిది కాదని తెలియవచ్చింది.

తనకు ద్విచక్ర వాహనాలంటే అమిత ఇష్టమని బోబ్డే గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా తను ఓ బుల్లెట్‌ను నడిపేవాడినని ఆయన తెలియచేశారు. అంతేకాదు ఆయన జంతుప్రేమికుడు, చక్కని ఫొటోగ్రాఫర్‌. కాగా, కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జస్టిస్‌ బోబ్డే ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారు. వీడియో సమావేశం ద్వారా కేసుల విచారణలో పాల్గొంటూ తీర్పులు వెలువరిస్తున్నారు.

ఆదర్శవంతమైన తీర్పులకు మారుపేరైన బోబ్డే... కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధించేందుకు వీలుగా సంప్రదాయ వస్త్రధారణలో ఉంటున్నారు. నల్లకోటు, గౌనులను తాత్కాలికంగా పక్కనపెట్టి నెక్‌బ్యాండ్‌తో కూడిన తెల్లని చొక్కా ధరిస్తే చాలని ఆయన అన్నారు. తాజాగా పూరీ జగన్నాథ రథయాత్ర కేసు సందర్భంగా ‘‘ (కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో) రథయాత్ర జరగనిస్తే జగన్నాథుడు మనను క్షమించడంటూ...’’ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని