ప్రాణవాయువునిచ్చే పచ్చని మొక్కలు!
close
Published : 27/04/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణవాయువునిచ్చే పచ్చని మొక్కలు!

ప్రస్తుతం కరోనా... విరుచుకుపడుతోంది. దీనికి ఒక్కటే మార్గం స్వీయ రక్షణ. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవడం. అందుకోసం కొన్ని ప్రత్యేక మొక్కలను మీ ఇంటికి తెచ్చేయండి. ఇవి స్వచ్ఛమైన గాలిని అందించడంతోపాటు ఇంటికి కొత్త శోభనిస్తాయి.

స్వచ్ఛమైన గాలి కోసం ఎక్కడెక్కడికో వెళ్లక్కర్లేదు. మనం ఉన్న చోటే పచ్చని మొక్కను పెంచితే అదే మనకు ప్రాణవాయువును ఇస్తుంది. గాలిని శుభ్రం చేయడంలో స్పైడర్‌ ప్లాంట్‌ ముందుంటుంది. దీన్ని హాలులో ఓ మూలన పెడితే అందంతోపాటు ఆక్సిజన్‌నూ ఇస్తుంది. అలాగే రబ్బర్‌ ప్లాంట్‌ కూడా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లగా మారుస్తుంది. కాబట్టి వేసవిలో ఇలాంటి మొక్కలను తప్పనిసరిగా పెంచాల్సిందే.
అందం, ఆరోగ్యం.. ఈ రెండింటినీ అందించే అద్భుతమైన మొక్క కలబంద. దీంట్లో బోలెడన్ని ఔషధ గుణాలుంటాయి. ఇది గాలిని శుభ్రం చేస్తుంది. దీని రసాన్ని తాగితే ఆరోగ్యం, జెల్‌ను ముఖానికి రుద్దితే అందం... ఇలా రెండూ పెరుగుతాయి. మరింకేం వెంటనే తెచ్చేసుకోండి. అలాగే బోస్టన్‌ ఫెర్న్‌కు నీరు ఎక్కువగా అవసరం ఉండదు. చుట్టుపక్కల ప్రాంతాలను చల్లగా ఉంచుతుంది.
చిన్ని బుట్టలో చక్కగా అమరిపోయే వెదురు ఇంటికే  కొత్త కళను తెస్తుంది. పీస్‌ లిల్లీ గాలిని శుభ్రం చేయడంతోపాటు రాత్రిపూట ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుందట. పాములా పొడవుగా ఉండటం వల్ల దీన్ని స్నేక్‌ ప్లాంట్‌ అని కూడా పిలుస్తారు. ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. దీనికి నీళ్లు కూడా చాలా తక్కువ అవసరమవుతాయి. కాస్త నీడ, పొడి ప్రదేశంలో పెట్టాలి. మన ఇళ్లల్లో ఎక్కువ కనపడే మొక్కల్లో మనీ ప్లాంట్‌ ఒకటి. దీన్ని పెంచితే బాగా డబ్బు వస్తుందని కొందరి నమ్మకం. డబ్బు సంగతెలా ఉన్నా ఇది సూక్ష్మజీవులను చంపేస్తుంది. కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని