సవాళ్లతో.. సంబరం
close
Published : 19/06/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సవాళ్లతో.. సంబరం

‘డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌. ఇఫ్‌ యూ ట్రబుల్‌ ద ట్రబుల్‌, ట్రబుల్‌ ట్రబుల్స్‌ యూ’ ఫన్నీగా ఉన్నా బాగా పేలిన సినిమా డైలాగ్‌ అది. దాని సంగతి అలా ఉంచితే.. కష్టాలకు ఎదురెళ్లి కావలించుకోకు.. తొడకొట్టి సవాల్‌ విసిరితే అవి తోక ముడిచి పరార్‌ అవుతాయి. చిన్నచిన్న ఇబ్బందులకే కుంగిపోయే యువతకు టానిక్‌లా పనికొచ్చే మాట ఇది. అంతేకాదు బాస్‌.. సవాళ్లు ఎదుర్కొనే సత్తా ఉన్నోడికి సదా సంతోషమేనట! కానీ కష్టాలు లేనిదెవరికి? ప్రేమించిన అమ్మాయి నో చెబితే కుర్రాడికి కష్టం. బాస్‌ చీవాట్లు పెడితే ఉద్యోగికి బాధ. మార్కులు బాగా రాకపోతే కాలేజీ విద్యార్థులదో వ్యధ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరి కష్టాలు వాళ్లవి. అయినా వీటినే తలచుకొని బెంగ పడితే ఏముంటుంది? ఆ కష్టాలనే కేర్‌ చేయక వాటి అంతు చూద్దాం అనుకున్నవారికే సంతోషాలు షేక్‌హ్యాండ్‌ ఇస్తాయట. సవాళ్లను ఛాలెంజ్‌ చేసి నిలిచినప్పుడు వచ్చే ఆ కిక్‌ భలేగా ఉంటుందంటున్నారు నిపుణులు.
విజయ గమ్యంపై జెండా పాతినప్పుడే కాదు.. ఆ సీన్‌ని ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోయేవాళ్లూ ఉంటారట. సక్సెస్‌ వశమైతే పెద్ద ట్రోఫీ గెలిచినట్టే లెక్క. ఇలా వన్‌ బై వన్‌ కష్టాలను ఎదుర్కోవడం అలవాటు అయితే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా డోంట్‌కేర్‌ అనుకుంటారట. హైరానా పడటం అనే మాట వీళ్ల డిక్షనరీలోనే ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సైలెన్సర్‌ బిగించిన గన్‌లా దూసుకుపోతుంటారు. పని చేసుకుపోతుంటారు. ఇదో అలవాటుగా మారిందా... స్థితప్రజ్ఞత పై పాకెట్లోకి వచ్చి చేరినట్టే. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనూ అదరరు, బెదరరు. ముఖాలపై నిత్యం నవ్వులు పూస్తుంటాయి. వీటికి బోనస్‌లా అణిగిమణిగి ఉండటం, మంచి వ్యక్తిత్వం అలవడతాయి. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ కిరీటం తలపై వచ్చి వాలిపోతుంది. ఇలా తొణక్కుండా, బెణక్కుండా సవాళ్లతో యుద్ధం చేసే కుర్రకారుకి సృజనాత్మకత ఎక్కువే ఉంటుందంటారు. అందుకే అమ్మాయిలూ, అబ్బాయిలూ కష్టాలు వస్తే చిగురుటాకులా వణికిపోవద్దు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆపై వచ్చే సక్సెస్‌కి తీపిదనం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం.. బరువు తగ్గకపోవడం.. కోరుకున్న అవకాశాలు అందకపోవడం.. ఎలాంటి సవాల్‌కైనా వెల్‌కమ్‌ పలకండి యార్‌. గుండెల్నిండా ఊపిరి పీల్చి వాటి అంతు చూడటం మొదలు పెట్టండి. విజయం ప్లస్‌ సంతోషం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని