బైక్‌ కేఫ్‌లు.. భలే సౌకర్యాలు!
close
Published : 11/05/2018 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బైక్‌ కేఫ్‌లు.. భలే సౌకర్యాలు!

బైక్‌ కేఫ్‌లు.. భలే సౌకర్యాలు!

అక్కడ ఎంచక్కా ఈతకొలనులో జలకాలాడొచ్చు. ఓ పూటంతా కునుకు తీయొచ్చు. విదేశీ వంటకాలు తింటూ ఫిదా అయిపోవచ్చు. పనిలోపనిగా చెడిపోయిన బైక్‌ల్ని బాగు చేయించుకోవచ్చు.ఇది బైక్‌ కేఫ్‌ల ట్రెండ్‌.
ద్విచక్రవాహనాలపై మమకారం ఉన్న చాలామంది దూరప్రయాణాలనూ ఇష్టపడుతుంటారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌.. మనాలి నుంచి లేహ్‌.. దిల్లీ నుంచి లద్దాఖ్‌.. చెప్పుకుంటూ పోతే బోలెడు టూర్లు. ఈ వేల కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురైతే? తీవ్రంగా అలసిపోతే? బైక్‌ మొరాయిస్తే? ఇదిగో ఇలాంటి అవసరాలు తీర్చే మజిలీలా మొదలయ్యాయి బైక్‌ కేఫ్‌లు.
అన్నీ ప్రత్యేకతలే: వాష్‌రూమ్‌లు.. హాయిగా కునుకు తీసేందుకు విశాలమైన పడకలు.. స్విమ్మింగ్‌పూల్‌లు.. ఎకరాలకొద్దీ విశాలమైన ప్రాంగణాలు.. ఈ బైక్‌ కేఫ్‌ల్లో అన్నీ ప్రత్యేకమే. బైక్‌తో సహా నేరుగా కేఫ్‌ల్లోకే వెళ్లిపోవచ్చు. తిండి విషయానికొస్తే బైకర్లకు అనుకూలమైన, తక్షణ శక్తినిచ్చే వంటకాలే వడ్డిస్తారు. అరేబియన్‌ ఆమ్లెట్‌, లిస్బన్‌ వాఫ్లెస్‌, పోర్చుగీస్‌ ఫ్రెష్‌ టోస్ట్‌, మటన్‌ థంప్‌, చికెన్‌ బుల్లెట్‌, మీట్‌ ఆర్గీ, జిమ్మీ జెర్క్‌ చికెన్‌, గ్యారేజ్‌ స్ర్‌ బర్గర్‌, ఓఎమ్‌జీ బర్గర్‌.. అంటూ రుచుల పేర్లు సైతం గమ్మత్తుగా ఉంటాయి. ఇండియన్‌, థాయ్‌, చైనీస్‌ అన్నీ అందుబాటులో ఉంటాయి. లోపల  వాతావరణం సైతం మది దోచేలా ఉంటుంది. కొన్ని కేఫ్‌ల్లో అయితే ఏకంగా బైక్‌ సీట్లే కుర్చీలవుతాయి. టైర్లే డైనింగ్‌ టేబుళ్లుగా మారిపోతాయి. గోడలకు బైక్‌ల విడిభాగాలు వేలాడుతుంటాయి. ఇక వేలకొద్దీ కిలోమీటర్లు ప్రయాణించిన తమ వాహనాలకు ఏవైనా మర్మతులు ఉంటే బాగు చేయడానికి మెకానిక్‌లు సిద్ధంగా ఉంటారు. చిన్నచిన్న విడిభాగాల నుంచి బైకింగ్‌ జాకెట్‌లు, హెల్మెట్లు, టైర్లు, ఇతర స్పేర్‌పార్ట్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని కేఫ్‌ల్లో అయితే ట్రయంఫ్‌, రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, హార్లే డేవిడ్‌సన్‌, డుకాటీ, హయబుసాలాంటి బైక్‌లు సైతం ప్రదర్శనకు పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కేఫ్‌ల నినాదం ఫన్‌, ఫుడ్‌, ఫ్రీడమ్‌. ప్రస్తుతానికి మనాలిలో ‘రైడ్‌ ఇన్‌ కేఫ్‌’, కోచిలో ‘చిల్లాక్స్‌’, గురుగ్రామ్‌లో ‘ది బైకర్స్‌ కేఫ్‌ 2.0 వెర్షన్‌’, దిల్లీలో ‘గ్యారేజ్‌ ఇంక్‌’, చండీగఢ్‌లో ‘పిట్‌బ్రూ’లు టాప్‌ కేఫ్‌లు. ఇలాంటి దేశవ్యాప్తంగా వందవరకు ఉన్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని