Co-win: కొవిన్‌ పోర్టల్‌లో మరిన్ని మార్పులు
close
Published : 01/06/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Co-win: కొవిన్‌ పోర్టల్‌లో మరిన్ని మార్పులు

టీకాలు తీసుకున్నవారికి వెంటనే ధ్రువపత్రాలు

దిల్లీ: కరోనా టీకా తీసుకున్నవారిలో కొందరికి సర్టిఫికెట్లు జారీ కావడం లేదనే ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ‘‘టీకాల కోసం పేర్ల నమోదు, సమయం నిర్థారించుకోవడం, లబ్ధిదారుల ధ్రువీకరణ కోసం ‘కొవిన్‌’ పోర్టల్‌ దోహదపడుతుంది. ఒక లబ్ధిదారుడు ఆన్‌లైన్‌లో గానీ, నేరుగా టీకా కేంద్రం వద్ద గానీ కొవిన్‌లో నమోదైనా.. అతనికి టీకా ఇచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని అదేరోజు నవీకరించడం చాలా ముఖ్యం. అలా జరగకపోతే మర్నాడు డేటా ఎంట్రీ చేయాలి. వివరాలు నవీకరించిన తర్వాతే టీకా ధ్రువపత్రంపై లబ్ధిదారునికి ఎస్‌ఎంఎస్‌ వెళ్తుంది. దానిలోనే వెబ్‌ లింక్‌ ఉంటుంది. దాని ద్వారా గానీ, కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ కావడం ద్వారా గానీ ధ్రువపత్రాన్ని పరిశీలించుకోవచ్చు. టీకా తీసుకుని ఆయా కేంద్రాల నుంచి లబ్ధిదారులు బయటకు వచ్చేలోగా ధ్రువపత్రం జారీ కావాలని కేంద్రం పలుమార్లు ఆదేశాలిచ్చింది. దీనిని కొవిన్‌ పోర్టర్, ఆరోగ్యసేతు/ఉమాంగ్‌ యాప్‌ల ద్వారానూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొదటి డోసు కాగానే తాత్కాలిక పత్రం, రెండోది కాగానే తుది పత్రం వస్తాయి. వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు ఆ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే మాత్రం కొవిన్‌ వ్యవస్థ ద్వారా ధ్రువపత్రం జారీ కాదు. దీనిని తొలగించడానికి వ్యవస్థలో త్వరలోనే కొన్ని మార్పులు చేయనున్నాం. పౌరులు కూడా టీకా పొందగానే ఎస్‌ఎంఎస్‌ ధ్రువీకరణ వచ్చిందో లేదో తనిఖీ చేసుకోవాలి’’ అని తెలిపింది.

జిల్లా అధికారుల సమాచారంతోనే స్లాట్లు 
టీకాల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నా అది దక్కుతుందనే గ్యారంటీ లేదన్న వార్తల్నీ కేంద్రం ఖండించింది. జిల్లా టీకాల అధికారి ఇచ్చే సమాచారం ఆధారంగా స్లాట్ల లభ్యత ఉంటుందని తెలిపింది. వ్యాక్సిన్లకు కొరత తలెత్తినప్పుడు మాత్రం కొన్నింటిని రద్దు చేయడమో, కొందరు లబ్ధిదారుల్ని వెనక్కి పంపడమో జరుగుతోందని వివరించింది. తేదీలను మార్చడానికి అవకాశాన్ని కొవిన్‌లో కల్పిస్తున్నామని, దానివల్ల కొన్ని విడతలను రద్దు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది. లబ్ధిదారులకూ తేదీ మార్పుపై సందేశం వెళ్తుందని వెల్లడించింది. వ్యాక్సిన్ల లభ్యత ఆధారంగానే స్లాట్లు ఇవ్వాలని, ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్లకు ప్రాధాన్యం ఉండాలని కూడా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని