పిల్లల మనసు తెలుసుకోండిలా..
close
Published : 10/04/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల మనసు తెలుసుకోండిలా..

ఓపికగా వినాలి.. పెద్దవాళ్లు ఏం చెప్పినా పిల్లలు వినాలి. కరెక్టే. కానీ అప్పుడప్పుడు పిల్లల మాట కూడా పెద్దవాళ్లూ వినాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే...

పిల్లలు ఏదైనా విషయం చెప్పబోతుంటే కొంతమంది అమ్మానాన్నలు ‘నాకు బోలెడంత పనుంది...ఉండు’ అంటూ కోప్పడతారు. వాళ్లేం చెబుతున్నారో పట్టించుకోరు. అలా ఎప్పుడూ చేయొద్దు. అసలు వాళ్ల మనసులో ఏముందో, వాళ్లు మీకేం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా వినండి. తర్వాత వాళ్లేం చేయాలో చేయకూడదో జెప్పండి.
స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి..
అమ్మానాన్నలకి చెబితే కొట్టడమో, తిట్టడమో చేస్తారనుకుని చాలామంది పిల్లలు తమ సమస్యల్ని బయటపెట్టరు. అందుకే ఏ విషయాన్నైనా ధైర్యంగా పంచుకునేలా స్వేచ్ఛనివ్వాలంటున్నారు పరిశోధకులు. లేదంటే సమస్య ఏదైనా వస్తే తమలో తాము కుంగిపోతారు.
స్నేహం చేయండి..
పిల్లలు ఏదైనా సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా ఇవ్వాలి. లేదంటే తెలిసీ తెలియని వాళ్లతో తమ సమస్యల్ని చెబుతారు. వారిచ్చే తప్పుడు సలహాలతో దారి తప్పే ప్రమాదమూ ఉంది.
సమయం వెచ్చించండి..
పిల్లలతో ఉదయం టిఫిన్‌ చేసే సమయంలో, రాత్రి పడుకునేముందు కొంచెం సమయాన్ని వెచ్చించండి. పిచ్చాపాటీ మాట్లాడుతూ అసలు వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో మెల్లిగా రాబట్టండి. తర్వాత సమస్యకి పరిష్కారం చెబుతూ వాళ్లకి ధైర్యాన్నివ్వండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని