మెరిసిపోండిలా...
close
Published : 05/05/2021 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెరిసిపోండిలా...

ఎండలో తిరిగిన కాసేపటికే చర్మం కమిలిపోతోందా? అయితే మోము మునుపటి కాంతితో మెరిసిపోవాలంటే... ఈ చిట్కాలు ప్రయత్నించండి....
బంగాళదుంపల నుంచి రసం తీసి దాన్ని ముఖానికి అప్లై చేయండి. వారానికి రెండు మూడు సార్లు రాసుకుంటే ముఖం మీద ఉన్న టాన్‌ తొలగిపోతుంది.
* సెనగపిండి, నెయ్యి, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేతితో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం స్మూత్‌గా మారుతుంది. చర్మం మీద ఉన్న నలుపు తగ్గి కాంతిమంతంగా ఉంటుంది.
* నానపెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాసుకుని అరగంటసేపు ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం తెల్లగా మెరుస్తుంది. మీగడలో పసుపు కలిపి రోజూ ముఖానికి పూతలా వేసి, మసాజ్‌ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
* పసుపు, చందనం రెండింటిని పాలమీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకుని, తర్వాత చన్నీళ్లతో శుభ్రంగా కడిగితే ముఖ ఛాయ పెరుగుతుంది.
* స్నానం చేసే నీటిలో కొద్దిగా యాపిల్‌సిడార్‌ వెనిగార్‌ కానీ, బేకింగ్‌ సోడా కానీ కలిపితే ఎండకు కమిలి, రంగు మారిన దేహం తిరిగి పూర్వపు వన్నెలోకి వస్తుంది.

ఈ కాలంలో ఎక్కువ శాతం ఫ్యాన్లు, కూలర్ల ముందు గడుపుతారు. దానివల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి బయటగాలి కూడా శరీరానికి తగిలేలా చూసుకోండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని