పూరీ సినిమా.. బన్నీ సలహా మర్చిపోను! - i do not forget bunny advise in my life
close
Published : 13/03/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పూరీ సినిమా.. బన్నీ సలహా మర్చిపోను!

రానా దగ్గుబాటి

హైదరాబాద్‌: కెరీర్‌ ప్రారంభించిన సమయంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రానా నటించిన చిత్రం ‘నేను నా రాక్షసి’. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహాను తాను ఎప్పటికీ మర్చిపోనని రానా తెలిపారు. గతంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘నెం.1యారి’ మంచి టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ టాక్‌ షో ‘సీజన్‌-3’ మొదలు పెట్టనున్నారు. షో లాంఛ్‌ ఈవెంట్‌లో భాగంగా రానా తన స్నేహితుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, చైతన్య.. తనకు మంచి స్నేహితులని. ముఖ్యంగా చరణ్‌ తనకి చిన్నప్పటి నుంచి మిత్రుడని.. తన లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానముంటుందని.. చెర్రీ తన 3AM ఫ్రెండ్‌ అని  రానా వివరించారు. అంతేకాకుండా ఎలాంటి సాయం కావాలన్నా ముందు చరణ్‌-బన్నీలకు ఫోన్‌ వెళ్తుందని ఆయన తెలిపారు. అనంతరం అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా గురించి స్పందిస్తూ.. ‘‘కథానాయకుడిగా నేను ఎంట్రీ ఇచ్చిన కొత్తలో బన్నీ ఇచ్చిన సలహా ఎప్పటికీ మర్చిపోను. ‘నేను నా రాక్షసి’ షూట్‌ ప్రారంభమైన సమయంలో బన్నీ లొకేషన్‌కు వచ్చారు. ‘‘అరేయ్‌.. ఇక్కడి వరకూ ఏదో స్కెచ్‌‌లేసుకుంటూ వచ్చేశావ్‌. ఇక్కడి నుంచి స్కిల్‌ లేకపోతే పని జరగదు’’ అని బన్నీ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది’’ అని రానా అన్నారు. అలాగూ మిహికాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మొదట తల్లిదండ్రులకే చెప్పానని.. అనంతరం చైతన్యకు కాల్‌ చేసి చెప్పానని రానా అన్నారు. తన పెళ్లి వార్త విని చైతన్య ఎంతో సంతోషించాడని.. తాను తీసుకున్న గొప్ప నిర్ణయం ఇదేనని చైతన్య అన్నాడని రానా వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని