పాక్‌కు భారత కరోనా టీకాలు..! - india to supply vaccines to pakistan
close
Published : 10/03/2021 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌కు భారత కరోనా టీకాలు..!

దిల్లీ: అంతర్జాతీయ సమాజంలో భారత్‌ మరోసారి తన సౌభ్రాతృత్వాన్ని చాటుకుంది. కశ్మీర్‌ విషయంలో దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఆ దేశానికి సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో పాక్‌కు 4.5కోట్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

గవీ(GAVI) ఒప్పందంలో భాగంగా భారత్‌ 45 మిలియన్ల స్వదేశీ కొవిడ్‌ టీకాలను పాక్‌కు సరఫరా చేయనుంది. ఇందులో 1.6కోట్ల డోసులను ఈ ఏడాది జూన్‌ నాటికి డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘‘మానవతా దృక్పథంలో పాక్‌కు సాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. దీనిపై త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది’’అని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికారులు జాతీయ మీడియా సంస్థలకు వెల్లడించారు. సీరమ్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాలను పాక్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరిలో ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి పాక్‌ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో సీరమ్‌ తయారుచేస్తున్న ఆస్ట్రాజెనెకా టీకాలను పాక్‌ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్‌కు 5లక్షల సినోఫార్మ్‌ టీకాలను పంపిస్తామని ఇటీవల చైనా ప్రకటించడం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. టీకా దౌత్యంలో భారత్‌ ముందుంది. ఇందులో భాగంగానే పలు ఒప్పందాల్లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. గ్రాంట్ సహకారం, కొవాగ్జ్‌, వాణిజ్య విక్రయాల్లో భాగంగా పలు దేశాలకు టీకాలను అందిస్తోంది. కేంద్ర విదేశాంగశాఖ రికార్డుల ప్రకారం.. ఇప్పటివరకు భారత్‌ 5.79కోట్లకు పైగా వ్యాక్సిన్లను సరఫరా చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని