విజయ్‌ దేవరకొండతో కత్రీనా కైఫ్‌ రొమాన్స్? - katrina kaif to romance vijay deverakonda
close
Published : 10/05/2021 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ దేవరకొండతో కత్రీనా కైఫ్‌ రొమాన్స్?

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్‌  నటి కత్రీనా కైఫ్‌ తెలుగు హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్‌ - పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘లైగర్‌ ’ చిత్రంలో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఒక చిత్రం కాగా  మరొకటి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ నటించనున్నాడు. ఇందులో ఒకటి పాన్‌ ఇండియా చిత్రంగా భారీస్థాయిలో తెరకెక్కనున్న చిత్రంలో కత్రీనా - విజయ్‌తో కలిసి నటించనుందనే వార్తలు వస్తున్నాయి. కత్రీనా తన కెరీర్‌ తొలినాళ్లలోనే ‘మల్లీశ్వరి’, ‘అల్లరిపిడుగు’ వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె తమిళంలో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో ‘మేరీ క్రిస్మస్‌’ చిత్రంలో విజయ్‌ సేతుపతి సరసన నటిస్తోంది. ఇవి కాకుండా హిందీలో ఇషాన్‌ ఖట్టర్‌, సిద్ధాంత్‌ చతుర్వేదిలతో కలిసి ‘ఫోన్‌ బూత్‌’లో నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని