కొవిడ్‌ ఆసుపత్రులుగా 5స్టార్‌ హోటళ్లు - mumbai five star hotels to convert into covid hospitals
close
Published : 15/04/2021 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఆసుపత్రులుగా 5స్టార్‌ హోటళ్లు

ముంబయి: దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి వణికిస్తోంది. నానాటికీ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మహారాష్ట్ర సహా గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో ఖాళీలేక రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వాణిజ్య రాజధాని ముంబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఫైవ్‌స్టార్‌ హోటళ్లను కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చేందుకు రంగం సద్ధం చేసింది. 

స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించేందుకు ముంబయి ఆసుపత్రులు ఐదు నక్షత్రాల హోటళ్లను ఉపయోగించుకోనున్నట్లు నగర వైద్యారోగ్య యంత్రాంగం గురువారం ప్రకటించింది. దీని వల్ల అత్యవసరమైన రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు వీలు లభిస్తుందని పేర్కొంది. ‘‘ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో చాలా మందికి అత్యవసర వైద్య చికిత్స అవసరం ఉండట్లేదు. కానీ, వారిని కూడా ఆసుపత్రుల పర్యవేక్షణలో ఉంచడం వల్ల ఎమర్జెన్సీ రోగులకు పడకలు దొరకట్లేదు. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు ఫోర్‌ స్టార్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకుని వాటిని తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చనున్నాయి. స్వల్ప లక్షణాలు ఉన్నవారు, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు అవసరం లేని రోగులను ఆ హోటళ్లకు తరలిస్తే అత్యవసరంలో ఉన్న కరోనా రోగులకు ఐసీయూల్లో చికిత్స అందించడం వీలవుతుంది’’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి లాక్‌డౌన్‌ వంటి కఠిన నిబంధనలతో జనతా కర్ఫ్యూ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. కేవలం అత్యవసర, నిత్యావసర సేవలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని