నాగార్జునతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ - nagarjuna act under praveen sattaru direction
close
Published : 28/07/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగార్జునతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు నాగార్జున ఆచితూచి కథలను ఎంచుకుంటున్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేయడంతో పాటు, కొత్తదనాన్ని ప్రోత్సహించే ఆయన మరోసారి ఆ బాటే పట్టారు. ‘గరుడవేగ’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఆయన దర్శకత్వంలో నాగార్జున నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఏషియన్ గ్రూప్ ఛైర్మన్‌ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నాగార్జున-ప్రవీణ్‌ సత్తార్‌ల సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అది పూర్తయిన వెంటనే ప్రవీణ్‌ సత్తారు సినిమా కోసం నాగ్‌ రంగంలోకి దిగుతారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని