స్కేటింగ్‌ చేస్తూ దొంగలను పట్టుకుంటారట! - pak police using skating shoes to catch theives
close
Published : 24/02/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కేటింగ్‌ చేస్తూ దొంగలను పట్టుకుంటారట!

కరాచీ పోలీసుల వినూత్న ఆలోచన

ఇస్లామాబాద్‌: సాధారణంగా నేరస్థులు, దొంగలను పట్టుకోవడానికి.. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులకు ప్రభుత్వం జీపులు, ద్విచక్రవాహనాలు, తుపాకులు, లాఠీలు ఇస్తాయి. కానీ, పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో పోలీసులకు అక్కడి పోలీసుశాఖ వాటితో పాటు స్కేటింగ్‌ బూట్లు ఇవ్వడం విశేషం. నగర వీధుల్లో పారిపోయే దొంగలను సులువుగా పట్టుకోవడం కోసం కొందరు పోలీసులకు స్కేటింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

పాకిస్థాన్‌లోని కరాచీ నగర వీధులు నిత్యం జనసంచారంతో బిజీగా ఉంటాయి. గుంపులుగా జనాలు తిరుగుతుండటంతో చోరీలు.. అమ్మాయిలపై వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలపై సమాచారం అందుకొని పోలీసులు అక్కడికి చేరుకోగానే దొంగలు, ఆకతాయిలు వీధుల్లో పరిగెడతారు. గుంపులు గుంపులుగా ఉండే జనాల మధ్య ఇట్టే తప్పించుకొని పారిపోతుండటంతో వారిని పట్టుకోవడం కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వారు అలా తప్పించుకోవడానికి వీల్లేకుండా కరాచీ పోలీసుశాఖ వినూత్న ఆలోచన చేసింది. స్కేటింగ్‌ బూట్లు ధరించి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని వీధుల్లో దూసుకెళ్తూ.. వీధుల్లో పరిగెత్తే దొంగలను సులువుగా పట్టుకోవచ్చనే ఉద్దేశంతోనే స్పెషల్‌ సెక్యూరిటీ యూనిట్‌లోని 20 మంది పోలీసులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. నల్లరంగు యూనిఫాంతో తుపాకి, ఇతర ఆయుధాలు కలిగి ఉండే ఈ 20 మంది పోలీసులకు స్కేటింగ్‌ చేస్తూనే తుపాకి బయటకు తీసి గురిపెట్టగలిగేలా, దొంగలను అదుపులోకి తీసుకునేలా శిక్షణ ఇస్తున్నారు.

కరాచీ నగరంలో అన్ని వీధులు స్కేటింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉండవు. అందుకే స్కేటింగ్‌కు వీలు ఉండి, చోరీలు.. వేధింపులు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే ఈ స్కేటింగ్‌ పోలీసులను మోహరిస్తారట. వీధుల్లో జరిగే నేరాలను కట్టడి చేయడానికి ఇలాంటి వినూత్న విధానం అమలు చేయడం అవసరమేనని స్కేటింగ్‌ పోలీసు విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని