Vaccination: అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్‌! - pfizers covid vaccine for 5-11 age group likely to be available in us by october end
close
Published : 13/09/2021 23:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccination: అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్‌!

అక్టోబరు చివరి నాటికి అందుబాటులోకి ఫైజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అక్టోబరు చివరి నాటికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్ తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో 12 ఏళ్ల కంటే అధిక వయసు గల వారికి వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. తాజాగా అంతకంటే తక్కువ వయసుగల వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది.

ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాజీ కమిషనర్‌ డాక్టర్‌ స్కాట్ గాట్లీబ్ మాట్లాడుతూ.. ‘చిన్నారులపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను నిశితంగా పరిశీలించాం. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అక్టోబరు 31లోపు టీకా సిద్ధంగా ఉండవచ్చు’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ స్పందించారు. ఫైజర్ వ్యాక్సిన్ సెప్టెంబర్ చివరి నాటికి అత్యవసర అనుమతి పొందినట్లయితే.. అక్టోబరు రెండో వారంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని