Radhe shyam: ఆ ఒక్క పాట చేస్తే సరి - prabhas radhe shyam team waiting for final song shoot
close
Updated : 23/05/2021 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Radhe shyam: ఆ ఒక్క పాట చేస్తే సరి

చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సినిమాల్లో ‘రాధేశ్యామ్‌’ ఒకటి. ఇంకో పది రోజులు చిత్రీకరణ జరిగుంటే సినిమా మొత్తం పూర్తయ్యేదే. నాయకానాయికలు ప్రభాస్‌ - పూజా హెగ్డేపై పాటని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉండగానే కరోనా ఉద్ధృతి పెరిగింది. దాంతో షూటింగ్‌ నిలిచిపోయింది. అయితే ఇప్పటికే సినిమా ఆలస్యం కావడంతో ... ఆ పాట లేకుండానే సినిమాని విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలు చిత్రబృందం చేసినట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఆ పాటని    తెరకెక్కించాల్సిందే అని నిర్ణయించినట్టు తెలిసింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. చిత్రీకరణలు ఎప్పుడు పునః ప్రారంభం అయితే అప్పుడు ఆ పాటని, మిగిలిన ఒకట్రెండు      సన్నివేశాల్ని పూర్తి చేయనున్నారు. మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. యు.వి.క్రియేషన్స్‌, గోపికృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కథ యూరప్‌   నేపథ్యంలో సాగుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 30న విడుదల చేస్తున్నట్టు ఇదివరకు ప్రకటించింది   చిత్రబృందం. చిత్రీకరణలు, థియేటర్లు పునః ప్రారంభం కావడంపైనే ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంటుంది.

 

 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని