పృథ్వీషా గర్ల్‌ఫ్రెండ్‌ బెల్లీ డ్యాన్స్‌ చూశారా!  - prithvi shaws rumoured girl friend prachi shakes instagram followers with her amazing dance performance
close
Updated : 06/05/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పృథ్వీషా గర్ల్‌ఫ్రెండ్‌ బెల్లీ డ్యాన్స్‌ చూశారా! 

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్‌..

(Prachi Photo: Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా, దిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్‌ పృథ్వీషా ప్రేయసిగా ప్రచారంలో ఉన్న యువనటి ప్రాచిసింగ్‌ తన డ్యాన్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఏడాది కాలంగా పృథ్వీ, ప్రాచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ అప్పుడప్పుడూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల్లో కామెంట్లు చేసుకుంటూ ఆ పుకార్లకు మరింత బలం చేకూరుస్తున్నారు. దాంతో ఈ యువ సెలబ్రిటీలు జంట పక్షులయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరోవైపు పృథ్వీ ఆస్ట్రేలియా పర్యటన అనంతరం అటు దేశవాళీ క్రికెట్‌, ఇటు ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ సత్తా చాటాడు. ఈ సీజన్‌లో దిల్లీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే అతడు బాగా ఆడిన సందర్భాల్లో ప్రశంసిస్తూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లోనూ పోస్టులు పెట్టేది. ఇదిలా ఉండగా, ప్రాచి తరచూ తన వర్కవుట్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్‌ కోసం చేసిన ప్రయోగ వీడియోను పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని