96కి చేరిన యూకే రకం కేసులు - six more uk strain cases are reported in india
close
Updated : 11/01/2021 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

96కి చేరిన యూకే రకం కేసులు

దిల్లీ: దేశంలో యూకే రకం కరోనా వైరస్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. సోమవారం మరో ఆరు కేసులు బయటపడటంతో..మొత్తం కేసుల సంఖ్య 96కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని బారినపడిన వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. అలాగే వారి తోటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. 

శనివారం రోజుకు యూకే రకం కేసులు 90గా ఉండగా..ఆదివారం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. అయితే ఈ కొత్త తరహా వైరస్ సంక్రమణ వేగంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో..కేంద్రం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది. వారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. బ్రిటన్‌ నుంచి విమాన సర్వీసులకు ఈ నెల 8న తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రం నిబంధనలను కఠినతరం చేసింది. 

ఇవీ చదవండి:

ఆ దేశంలో కరోనా వైరస్ తొలి కేసు..

మొదటిసారి 200 దిగువగా మరణాలుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని