మన హీరోయిన్స్‌ను ఇలా చూశారా? - star heroins memes goes viral in internet
close
Published : 28/09/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మన హీరోయిన్స్‌ను ఇలా చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అందం, అభినయంతో ఆకట్టుకునే నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. వారంతా తరచూ సామాజిక మాధ్యమాల వేదికగా అదిరిపోయే స్టిల్స్‌తో ఫొటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు తమ చిన్నప్పటి ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటారు. వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఫొటోనే ఒకటి సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. మన తెలుగు స్టార్‌ కథానాయికలు చిన్న పిల్లలుగా మారిపోతే ఎలా ఉంటారో తెలియజేస్తూ మీమీ తయారు చేశారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాదు, ‘మన హీరోయిన్లు భలే క్యూట్‌గా ఉన్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కీర్తి సురేశ్‌, రష్మిక, అనుపమ పరమేశ్వరన్‌, సమంత, అనుష్క, కాజల్‌, రాశీఖన్నా, తమన్నా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని