Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌ - telugu news army helicopter crashes in jammu and kashmir
close
Updated : 03/08/2021 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. రంజిత్‌ సాగర్‌ డ్యాం సమీపంలో ఆర్మీ ఏవియేషన్‌ ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అయితే సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణమా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతస్థాయి వర్గాలు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని