IPL 2021: వాహ్‌..! కార్తీక్‌ త్యాగి.. నీ బౌలింగ్‌ అమోఘం: బుమ్రా, స్టెయిన్‌ - telugu news jasprit bumrah and dale steyn praised kartik tyagi for his brilliant bowling in last over vs punjab kings
close
Published : 23/09/2021 01:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: వాహ్‌..! కార్తీక్‌ త్యాగి.. నీ బౌలింగ్‌ అమోఘం: బుమ్రా, స్టెయిన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌ చూసి టీమ్‌ఇండియా పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఫిదా అయ్యారు. మంగళవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్‌కు ఊహించని విజయం దక్కింది.

ఇదివరకు 2008లో ఇదే రాజస్థాన్‌ జట్టులో ఆడిన మునాఫ్‌ పటేల్‌.. ఒకసారి ముంబయి ఇండియన్స్‌తో తలపడిన సందర్భంగా ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయకుండా నిలువరించాడు.  మ్యాచ్‌ అనంతరం బుమ్రా, స్టెయిన్‌ కార్తీక్‌ను మెచ్చుకున్నారు. ఇలా ఉత్కంఠ పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించారు. ‘కార్తీక్‌.. ఏం ఓవర్‌ వేసావ్‌..! అలాంటి అత్యంత ఉత్కంఠకర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండి పని పూర్తి చేశావ్‌. నీ బౌలింగ్‌ అమోఘం. అది నన్ను ఆకట్టుకుంది’ అని బుమ్రా ట్వీట్ చేశాడు. మరోవైపు స్టెయిన్‌ స్పందిస్తూ.. ‘వావ్‌.. ఇదివరకెన్నడూ లేని విధంగా ఛేదనలో అత్యుత్తమ చివరి ఓవర్‌ వేశావ్‌’ అని కీర్తించాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా స్పందిస్తూ.. ‘అద్భుతమైన మ్యాచ్‌, కార్తీక్‌ త్యాగి చాలా బాగా బౌలింగ్‌ చేశావ్‌’ అని మెచ్చుకున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని