Suicide: వివాహం కావడం లేదని యువకుడి బలవన్మరణం - telugu news young man suicide who was not going to get married
close
Updated : 30/08/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suicide: వివాహం కావడం లేదని యువకుడి బలవన్మరణం

హుజూర్‌నగర్‌ గ్రామీణం: వివాహం కావడం లేదని మనస్తాపానికి గురైన యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కోదాడ రోడ్డులో ఫ్యాన్సీ అండ్‌ జనరల్‌ స్టోర్‌ను నిర్వహిస్తున్న పోల నరేశ్‌ (29) పెళ్లి సంబంధాలు రాకపోవడం, వివాహం కావడం లేదని జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 26న మట్టపల్లి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఖమ్మం వెళ్లి అక్కడ ఓ లాడ్జిలో పురుగు మందు తాగాడు. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వాళ్లు అక్కడకు వెళ్లి ఖమ్మంలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని