ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  - ten districts contribute 45.65percent of indias active caseload
close
Updated : 10/04/2021 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు! 

దిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్‌ రోగుల గ్రాఫ్‌ మళ్లీ పైకి ఎగబాకుతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 10.46లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. వాటిలో 45.65% కేవలం పది జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. దేశంలోని మొత్తం కరోనా రోగుల్లో పుణెలో అత్యధికంగా 9.56%మంది ఉండగా.. ముంబయిలో 8.41%, ఠానే 6.45%, నాగ్‌పుర్‌ 6.02%, బెంగళూరు అర్బన్‌ 4.06%, నాసిక్‌ 3.44%, దిల్లీ 2.54%, రాయ్‌పూర్‌ 1.78%, దుర్గ్‌ 1.76%, ఔరంగాబాద్‌ 1.62% చొప్పున ఉన్నారు.

రాష్ట్రాల వారీగా యాక్టివ్‌ కేసుల్ని పరిశీలిస్తే.. ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ రోగుల్లో 72శాతం మంది కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 52.23శాతం ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో 7.34%, కర్ణాటక 5.55%, యూపీ 4.62%, కేరళ 3.49%గా కొవిడ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి 27.77% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
ఇకపోతే దేశంలో నిన్న ఒక్కరోజే నమోదైన మరణాల విషయానికి వస్తే..  794  మరణాలు నమోదయ్యాయి. వీటిలో 86.78 శాతం కేవలం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే (301) ఉండటం అక్కడ కరోనా ఉద్ధృతికి నిదర్శనం. అలాగే, దేశంలోని 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నిన్న ఒక్క కొవిడ్‌ మరణమూ నమోదుకాకపోవడం ఊరట కలిగిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని