Top 10 News @ 5 PM - top ten news at five pm
close
Updated : 27/04/2021 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top 10 News @ 5 PM

1. పని ఒత్తిడి.. వైద్యుడి చెంప చెళ్లుమనిపించిన నర్సు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వైద్యుడు, నర్సు ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాంపూర్‌ జిల్లా ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని.. పనిభారంతో ఒత్తిడి పెరిగి వారిద్దరూ వాగ్వాదానికి దిగినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్టర్‌తో ఘర్షణకు దిగిన నర్సు.. అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ వైద్యుడు కూడా నర్సుపై దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

KTR: ఏడాది చిన్నారి.. కేటీఆర్‌ నినాదం

2. Sangam Dairy: ప్రభుత్వ పరిధిలోకి సంగం డెయిరీ

గుంటూరు జిల్లా వడ్లమూడి వద్ద ఉన్న సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగం డెయిరీలో వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నివేదిక సమర్పించింది. ఏసీబీ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్‌ వెల్లడించింది. అంతకుముందు సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసింది. బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కాసేపటికే ఉపసంహరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరోనా సంక్షోభం వేళ.. ప్రేక్షకపాత్ర పోషించలేం!

 కొవిడ్‌ మహమ్మారితో యావత్‌ దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రేక్షకుడిగా ఉండలేమని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కరోనా విలయంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన స్థితిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని తెలిపింది. రాష్ట్రాల మధ్య జరుగుతున్న సహకారాలను సమన్వయ పరచడంలో తమ పాత్ర ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Mandaviya: ‘నా కుమార్తె... నాకు గర్వకారణం’

4. ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలి: జగన్‌

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా  కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 104 కాల్‌సెంటర్‌ సమర్థంగా పనిచెయ్యాలని.. ఫోన్‌ చేసినవారికి తక్షిణమే పరిష్కారం చూపాలని జగన్‌ ఆదేశించారు. 104కి ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని పునరుద్ఘాటించారు. 104 కాల్‌సెంటర్‌కు వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Delhi Corona: దేశ రాజధానిలో మృత్యుఘోష!

 కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశ రాజధాని దిల్లీ వణికిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్‌ (Covid) మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ అత్యధికంగా 380 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు వ్యవధిలో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారని దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో కొవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికలు సరిపోవడం లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10 రాష్ట్రాలు..69 శాతం కొత్త కేసులు

6. Vakeelsaab: ఓటీటీలో పవన్‌ చిత్రం

ఇటీవల థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా శ్రీరామ్‌ వేణు ‘వకీల్‌సాబ్‌’ను తెరకెక్కించారు. సత్యదేవ్‌గా లాయరు పాత్రలో అదరగొట్టారు పవన్ కల్యాణ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Covaxin: తెలంగాణకు ఎక్కువ డోసులివ్వండి

కొవిడ్ టీకాల పంపిణీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల కలిశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీకాల విషయమై భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్‌ చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

8. మదనపల్లె హత్యలు.. నిందితులకు బెయిల్‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో మదనపల్లెలోని తమ ఇంట్లో కన్న కుమార్తెలు ఇరువురినీ దారుణంగా హతమార్చిన కేసులో అరెస్టు అయిన పద్మజ, పురుషోత్తంలకు మదనపల్లె న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. 48,424 వద్ద సానుకూలంగా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సెన్సెక్స్‌ 49,009 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 557 పాయింట్లు ఎగబాకి 48,944 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,493 వద్ద బలంగా ప్రారంభమై రోజులో 14,667-14,484 మధ్య కదలాడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Lockdown ఎఫెక్ట్‌: రూ. 5లక్షల కోట్ల నష్టం

10. IPL:ప్రత్యేక విమానం ఏర్పాటు చేయండి:క్రిస్‌ లిన్‌

 తమను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్‌ విమానం ఏర్పాటు చేయాలని ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్‌ లిన్‌.. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఐపీఎల్‌ టోర్నీపైనా పడింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరిలో ఆండ్రూ టై, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని