Paytm: ఇకపై వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు! - you can now book covid19 vaccine appointments on paytm app facilitates search cowin registration also
close
Updated : 14/06/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Paytm: ఇకపై వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు!

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం అందుబాటులో ఉన్న కొవిన్‌ యాప్‌తో పాటు థర్డ్‌ పార్టీ డెవలపర్ల నుంచి వ్యాక్సిన్‌ స్లాట్‌ల బుకింగ్‌కు కేంద్ర ప్రభుత్వం గత నెలలో అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం తమ యాప్‌లో వ్యాక్సినేషన్‌ స్లాట్‌ బుకింగ్‌ను ప్రవేశపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. పేటీఎం వినియోగదారులు తమ సమీపంలోని వ్యాక్సిన్‌ కేంద్రాలు తెలుసుకొనేందుకు, కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల స్లాట్‌లను బుక్‌ చేసుకోవడానికి సహాయపడుతుందని వారు వెల్లడించారు. వినియోగదారులు వ్యాక్సిన్‌ స్లాట్లను బుక్‌ చేసుకొని టీకా తీసుకునేందుకు ఈ కొత్త సేవలు సహకరిస్తాయని పేటీఎం ప్రతినిధులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న టీకా రకంతో పాటు దాని రుసుము వంటి ఇతర సమాచారం కూడా తమ యాప్‌లో అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ వంతు బాధ్యతగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని వారు పేర్కొన్నారు. దీని ద్వారా టీకా పంపిణీ ప్రక్రియ వేగవంతమవుతుందన్నారు. కొవిడ్‌-19 సహాయక చర్యల్లో భాగంగా పేటీఎం సంస్థ ఇప్పటికే అనేక ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళం ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని