త్వరలోనే ‘జాంబిరెడ్డి-2’ - zombiereddy2 announced by director prashantvarma
close
Published : 23/03/2021 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

త్వరలోనే ‘జాంబిరెడ్డి-2’

విజయవాడ‌: ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన ‘జాంబిరెడ్డి’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించింది. దానికి కొనసాగింపుగా ‘జాంబిరెడ్డి2’ను రాబోతోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌వర్మ స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 26 నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం విజయవాడలో సందడి చేసింది.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలకు థియేటర్లు దొరకవు అనే వాదన అబద్ధం. జాంబిరెడ్డిని 500 థియేటర్లలో విడుదల చేశాం. సినిమా రూ.15కోట్లు వసూలు చేసింది. జాంబిరెడ్డిని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తేజకు హీరోగా తొలి సినిమానే మంచి విజయం దక్కింది. థియేటర్‌లో చూడలేనివారికోసం ఓటీటీలో విడుదల చేస్తున్నాం. దీనికి కొనసాగింపుగా ‘జాంబిరెడ్డి2’ను త్వరలోనే తెరకెక్కిస్తాం’ అని ప్రశాంత్‌వర్మ అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని