close
టాలీవుడ్‌
రామోజీ  ఫిలింసిటీలో ‘సాహో’ వేడుక

ప్రభాస్‌ హీరోగా  యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 18న రామోజీ ఫిలింసిటీలో విడుదల ముందస్తు వేడుక జరగనుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యే ఈ వేడుకని ఇప్పటివరకు ఎవరూ చేయని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టు నిర్మాతలు  తెలిపారు. అందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ‘‘హాలీవుడ్‌ సినిమాల స్థాయి యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు ప్రచార చిత్రాలూ ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ సందడిని మరింత పెంచుతూ విడుదల ముందస్తు వేడుక జరపబోతున్నాం. ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్‌ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలు, అందమైన ప్రేమకథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు నిర్మాతలు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజయ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: తనిష్క్‌ బగేచీ, గురు రంధ్వా, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.మది.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.