icon icon icon
icon icon icon

ఖమ్మంలో నటుడు వెంకటేశ్‌ కుమార్తె ప్రచారం

రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆయన కోడలు, ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత పేర్కొన్నారు.

Updated : 07 May 2024 06:52 IST

మామ రఘురాంరెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థన

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: రామసహాయం రఘురాంరెడ్డికి చాలా పట్టుదలని, మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారని ఆయన కోడలు, ప్రముఖ సినీనటుడు వెంకటేశ్‌ కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత పేర్కొన్నారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రసాద్‌ హైట్స్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ ఆత్మీయ సమావేశానికి హాజరై మాట్లాడారు. తన మామ కుటుంబసభ్యులతో ఎంత ప్రేమగా ఉంటారో.. ప్రజల పట్లా అంతే వాత్సల్యంతో ఉంటారని చెప్పారు. ఏదైనా పని మొదలుపెడితే నూరు శాతం పూర్తయ్యే వరకు విశ్రమించరన్నారు. అందరూ ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img