logo

హైదరాబాద్‌లో ఆ ఏడు ప్రాంతాలు హీట్‌ ఐలాండ్లు

చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది.

Updated : 07 May 2024 07:57 IST

అక్కడ అత్యధిక భూ ఉపరితల ఉష్ణోగ్రత

ఈనాడు, హైదరాబాద్‌: చెట్ల నరికివేత, పట్టణీకరణతో నగరం కాంక్రీటు వనంలా మారి నిప్పు కుంపటిని తలపిస్తోందని హైదరాబాద్‌ అర్బన్‌ ల్యాబ్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన పరిశోధన నివేదిక స్పష్టం చేస్తోంది. మార్చిలో నగరవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైనట్లు తెలుపుతూ.. వాటిని అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌గా పేర్కొంది. భూ ఉపగ్రహ, గూగుల్‌ ఎర్త్‌లోని ఉష్ణోగ్రతల సమాచారాన్ని విశ్లేషించగా మైలార్‌దేవ్‌పల్లి, బీఎన్‌రెడ్డినగర్‌, మన్సూరాబాద్‌, పటాన్‌చెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో నేల మీద నిలవలేనంతగా భూమి వేడెక్కినట్లు తెలిపింది. ఆయా ప్రాంతాల్లో నేలపై ఉన్న ఉష్ణోగ్రతలు 49డిగ్రీలుగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. క్రమంగా హీట్‌ ఐలాండ్లు పెరుగుతాయని, చెట్లను పెంచి పచ్చదనాన్ని విస్తరిస్తేగానీ పరిస్థితిని అదుపుచేయలేమని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని