కుడి ఎడమైతే.. - aha kudi yedamaithe with amala paul
close
Published : 27/06/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుడి ఎడమైతే..

కథానాయిక అమలాపాల్‌ వెబ్‌ సిరీస్‌ల్లో మెరుస్తూనే ఉంది. ఆమె ప్రధాన పాత్రధారిగా ‘కుడి ఎడమైతే’ సిరీస్‌ రూపొందుతోంది. సైంటిఫిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో యువ కథానాయకుడు రాహుల్‌ విజయ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ‘యూ టర్న్‌’ ఫేమ్‌ పవన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం కానుంది. శనివారం మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘అమలాపాల్‌ పోలీస్‌ అధికారిగా నటించింది. రాహుల్‌ విజయ్‌  డెలివరీ బాయ్‌ పాత్రలో ఆకట్టుకుంటారు. భిన్నమైన రంగాలకి చెందిన ఇద్దరి జీవితం ఎలా కలిసింది? ఇందులో నేరం, దాని వెనక కారణాలు ఆసక్తిని రేకెత్తిస్తాయ’’ని ‘ఆహా’ వర్గాలు వెల్లడించాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని