Bigg Boss 5: రవి గడ్డి తినమంటే తింటావా? యాక్టర్స్‌ అంటే చిన్న చూపా? - bigg boss telugu 5 nagarjuna asks sanchalaks clarification for ravi
close
Updated : 16/10/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss 5: రవి గడ్డి తినమంటే తింటావా? యాక్టర్స్‌ అంటే చిన్న చూపా?

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’లో ఈ వారం జరిగిన ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్‌పై వ్యాఖ్యాత నాగార్జున విచారణ మొదలు పెట్టారు. అంతకు ముందు నామినేషన్స్‌ సందర్భంగా ‘మీరంతా నటులు’ అంటూ శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలపైనా నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ‘యాక్టర్‌ అంటే చిన్న చూపా’ అంటూ శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రాపర్టీని నాశనం చేసిన రవి, శ్వేత, లోబోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రవి చెబితేనే వెళ్లి కుషన్‌ కట్‌ చేసి, తీసుకొచ్చా’ అని లోబో చెప్పగా, ‘రవి గడ్డి తినమంటే తింటావా’ అని నాగ్‌ మండిపడ్డారు. ‘కుషన్‌లోని దూదిని తీసుకొచ్చిన విషయం నీకు తెలియదు అని చెప్పకు’ అని శ్వేత అనగా,  రవి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టాడు. ‘ఇవన్నీ చూస్తుంటే నటరాజ్‌ మాస్టర్‌ చెప్పిందే(రవిని గుంటనక్క అన్నారు) కరెక్ట్‌ అనిపిస్తోంది’ అని నాగార్జున అనడంతో రవి చిన్నబోయాడు. ‘సంచాలకులైన కాజల్‌, సిరి ఈ విషయంలో రవిని నమ్మాలా? వద్దా’ అని నాగార్జున అడిగారు. మరి వారు ఏం సమాధానం చెప్పారు? ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న  10మందిలో ఎవరు సేవ్‌ అయ్యారు? తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే!



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని