Consumer Commission: ‘రూ.6.25 తిరిగి ఇచ్చేయండి’
close
Updated : 05/08/2021 07:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Consumer Commission: ‘రూ.6.25 తిరిగి ఇచ్చేయండి’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జాంబాగ్‌కు చెందిన ఎస్‌.ఉమేశ్‌కుమార్‌ ఏఎస్‌రావునగర్‌లోని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌లో రూ.1,198 వెచ్చించి రెండు జీన్స్‌ ప్యాంట్లను 2019 ఏప్రిల్‌లో కొనుగోలు చేశారు. బిల్లు చేతికిచ్చిన తర్వాత క్యారీ బ్యాగ్‌కు రూ.6.25 వసూలు చేసినట్లు గుర్తించారు. అన్‌లిమిటెడ్‌ లోగో ఉన్న సంచికి డబ్బులు ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. లోగో లేని సంచి ఇవ్వాలని కోరగా అలాంటివి లేవని బదులిచ్చారు. దీంతో ఉమేశ్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన రంగారెడ్డి జిల్లా కమిషన్‌ రూ.6.25 తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా రూ.1,500, కేసు ఖర్చుల నిమిత్తం రూ.1,000, ముప్పై రోజుల వ్యవధిలో చెల్లించాలని అన్‌లిమిటెడ్‌ స్టోర్‌ను ఆదేశించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని