close
Published : 28/02/2021 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘హిట్‌ 2’ ఖరారు.. కేడీ ఎవరు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హిట్‌’. గతేడాది ఇదే రోజు విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా హిట్‌ సెకండ్‌ పార్ట్‌ రాబోతుందని కథానాయకుడు, ఆ చిత్ర నిర్మాత నాని ప్రకటించారు. ‘హిట్‌ విడుదలై ఈ రోజుతో సంవత్సరమైంది. పార్ట్‌ 2ని ప్రకటించేందుకు ఇంతకన్నా మంచి రోజు ఏం కావాలి!  హిట్‌ సినిమాలో తెలంగాణ టీంలో పనిచేసే విక్రమ్‌ రుద్రరాజు(కథానాయకుడి పాత్ర) ఎంతటి ఉత్కంఠకు గురి చేశాడో మీరు చూశారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ టీంలో పనిచేసే కేడీ సమయం ఆసన్నమైంది. అంతకుమించి ఉత్కంఠతో కూడిన ప్రయాణం ఇది. మరి కేడీ ఎవరు?’ అంటూ ట్వీట్‌ చేసి ఆసక్తి పెంచుతున్నారు నాని. కేడీ అంటే విశ్వక్‌ సేన్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ పాత్ర అని కొందరు అభిప్రాయపడుతుంటే.. కొత్త పాత్ర, కొత్త హీరో అని మరికొందరు సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ కేడీ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించారు. రుహానీ శర్మ నాయిక. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చి విశేష ప్రేక్షకాదరణతో హిట్‌ అనిపించుకుందీ చిత్రం. ప్రస్తుతం ఇదే సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు శైలేష్‌. రాజ్‌కుమార్‌ రావ్‌ కథానాయకుడు.

 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని