హైదరాబాద్: నందితాశ్వేత ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అక్షర’. చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. సురేశ్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 26 విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలోని ‘సిలకాసిలకా’ పాటను యువ కథానాయకుడు విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.. పాట చాలా బాగుంది. చిన్న సినిమాలకు కాసుల వర్షం కురుస్తోంది. అక్షర సినిమాకు కూడా బాగా కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. దర్శకుడు చిన్ని కృష్ణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థ లోపాలను చూపిస్తూ అక్షర సినిమా రూపొందించామని, ప్రేక్షకులకు ‘అక్షర’ మంచి అనుభూతి ఇస్తుందన్నారు. నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. చిన్న సినిమాగా అక్షరను మొదలుపెట్టాం. అందరి సహకారంతో పెద్ద సినిమాగా రిలీజ్ చేస్తున్నామన్నారు. హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.. అక్షర సినిమా ఒక మంచి సినిమా. థియేటర్ నుంచి బయటకు వచ్చేప్పుడు మంచి ఫీల్‌తో వస్తారని చెప్పింది. ఈ కార్యక్రమంలో నటుడు మధు నందన్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ ఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘మగధీర’ కాదిక్కడ.. ‘మర్యాద రామన్న’
- మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- మోహన్‌బాబు సరసన మీనా!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ