Vishwak Sen: న‌లుగురు నాయిక‌ల‌తో.. - vishwak ott entry
close
Published : 05/06/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishwak Sen: న‌లుగురు నాయిక‌ల‌తో..

ఇంట‌ర్నెట్ డెస్క్: సినిమా అవ‌కాశాల విష‌యంలో జోరు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. ఇప్ప‌టికే ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న విశ్వ‌క్ తొలిసారి డిజిట‌ల్ మాధ్య‌మంలో అడుగుపెడుతున్నాడు. ‘అక్టోబర్31 లేడీస్ నైట్’ అనే వెబ్ సిరీస్‌లో అతిథి పాత్ర పోషించాడు. మంజిమా మోహ‌న్‌, మేఘా ఆకాశ్‌, నివేదా థామ‌స్‌, రెబా మోనిక  ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న సిరీస్ ఇది. ‘తలైవి’ చిత్ర ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌. విజ‌య్ ఈ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి ఆ న‌లుగురి అమ్మాయిలతో విశ్వ‌క్ సేన్‌కి సంబంధమేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్ర‌స్తుతం పాగ‌ల్‌, అశోకవ‌నంలో అర్జున క‌ల్యాణం చిత్రాల‌తోపాటు టైటిల్ ఖ‌రారు కాని మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నాడు విశ్వ‌క్‌.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని