ఏపీ అన్యాయం చేస్తే ఊరుకోం: శ్రీనివాస్‌గౌడ్‌ - minister srinivas goud reaction on krishna water
close
Updated : 22/06/2021 11:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ అన్యాయం చేస్తే ఊరుకోం: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారని, అలాగని ఏపీ తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తాము మంచిని కోరుకుంటున్నప్పటికీ ఏపీ పాలకులు మాత్రం గొడవకు సిద్ధమవుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను నెల్లూరు జిల్లాకు తరలించాలని ఏపీ పాలకులు చూస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ‘నదీ పరివాహకం లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? నది పక్కనున్న పాలమూరుకు వద్దా?’అని ఆయన ప్రశ్నించారు. ట్రైబ్యునల్‌, ఎన్‌జీటీ ఆదేశాలనూ ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని, టెలిమెట్రీలు ధ్వంసం చేసి ఏపీ అక్రమంగా నీరు తీసుకుంటోందని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని