Narendra Giri death case: నరేంద్రగిరి మహారాజ్‌ మృతిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ - narendra giri death case.. cbi takes over case from up police
close
Published : 24/09/2021 23:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narendra Giri death case: నరేంద్రగిరి మహారాజ్‌ మృతిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అఖిల భారత్‌ అఖాడ పరిషత్‌ అధిపతి మహంత్‌ నరేంద్రగిరి మహారాజ్‌  ఆత్మహత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేపట్టింది. ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సీబీఐకి బదలాయించారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన శిష్యుడు ఆనందర్‌ గిరి, సందీప్‌ తివారీ, ఆధ్యప్రసాద్‌లను అరెస్టు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో సోమవారం  పైకప్పునకు వేలాడుతూ మహంత్‌ నరేంద్రగిరి మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి.

‘ఆనంద్‌గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యా. సెప్టెంబర్‌ 13నే తనవు చాలించాలనుకున్నా. కానీ ధైర్యం సరిపోలేదు. ఓ మహిళతో నేను కలిసి ఉన్నట్లు చూపే ఫొటోను కంప్యూటర్‌ సాయంతో రూపొందించి నన్ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఆనంద్‌గిరి సిద్ధమైనట్లు నాకు తెలిసింది. ఇది నన్ను కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఎంత గౌరవంగా జీవించాను. ఇలాంటి అపఖ్యాతితో జీవించలేను. అందుకే తనువు చాలిస్తున్నా’ అని నరేంద్రగిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని