Cinema News: ‘మేజర్‌’ జోరు - overseas rights of major film sold for a whopping amount
close
Published : 11/06/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘మేజర్‌’ జోరు

హైదరాబాద్‌: ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎ ప్లస్‌ ఎస్‌ సినిమా సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. జులై 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ఓవర్సీస్‌ రైట్స్‌ అమ్మకం పూర్తయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ హక్కులను వీకెండ్‌ సినిమాస్, సదరన్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు    సంయుక్తంగా దక్కించుకున్నట్లు తెలియజేశారు. ఇందులో సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని