నయనతారపై రాధారవి అనుచిత వ్యాఖ్యలు - radha ravi slut shames nayanthara at political event
close
Published : 02/04/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయనతారపై రాధారవి అనుచిత వ్యాఖ్యలు

నటిపై రాధారవి తీవ్ర వ్యాఖ్యలు

చెన్నై: అగ్రకథానాయిక నయనతార గురించి కోలీవుడ్‌ డబ్బింగ్‌ యూనియన్‌ ఆర్టిస్ట్‌ ప్రెసిడెంట్‌, భాజపా నాయకుడు రాధారవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో డీఎంకే పార్టీ కోసం పనిచేసిన రాధారవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన భాజపా-ఏఐఏడీఎంకే పొత్తు తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార వేదికపై మాట్లాడుతూ నయనతార గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘డీఎంకే పార్టీకి నయనతార ఏమవుతుంది? ఆమె ఏమైనా ఆ పార్టీకి పీఆర్‌వోనా(ప్రజా సంబంధాల అధికారి)? గతంలో ఓ సభలో ఆమె గురించి మాట్లాడినందుకు ఆ పార్టీ నుంచి నన్ను తొలగించాలని కొంతమంది పెద్దలు చూశారు. తొలగింపు ఆదేశాలు వాళ్లు నాకు పంపించేలోపే నేనే ఆ పార్టీకి శాశ్వతంగా రాజీనామా చేశా. ఒకవేళ ఆమె కనుక ఉదయనిధి స్టాలిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను?’’ అని రాధారవి వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, గతంలోనూ రాధారవి ఓ సినిమా వేడుకలో నయన్‌ గురించి అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన డీఎంకే పార్టీకి రాజీనామా చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని