Tollywood: స్టార్‌హీరోలు.. రేర్‌ ఫొటోలు - rare photos of tollywood star heros
close
Updated : 02/07/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: స్టార్‌హీరోలు.. రేర్‌ ఫొటోలు

ఆనాటి ఫొటోలు నేడు ట్రెండింగ్‌లో

ఇంటర్నెట్‌డెస్క్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని తన దేవరగా అభివర్ణించుకుంటూ తరచూ ఆయనకు సంబంధించిన అరుదైన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేస్తున్నారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌. అలాగే తమన్‌ సైతం పవన్‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇటీవల నెటిజన్లతో పంచుకున్నారు. బండ్ల గణేష్‌, తమన్‌ మాత్రమే కాకుండా పలువురు స్టార్‌హీరోల అభిమానులు తమ హీరో ఫొటోలను ఆన్‌లైన్‌ వేదికగా అందరితో పంచుకుంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. దీంతో టాలీవుడ్‌ స్టార్‌హీరోల రేర్‌ ఫొటోలు గత కొన్నిరోజుల నుంచి ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!

అప్పట్లో అన్నగారు ఇలా..!

తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా చెప్పుకునే నందమూరి తారకరామారావు సినిమాల్లోకి రాకముందు కొంతకాలంపాటు సబ్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన తోటి ఉద్యోగులతో కలిసి అన్నగారు తీసుకున్న ఓ ఫొటోని ఇటీవల ‘ఎన్టీఆర్‌ జయంతి’ సందర్భంగా  ఓ అభిమాని సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు.


మెగా బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్..!

ఓ మామూలు నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తన తమ్ముళ్లు నాగబాబు, పవన్‌కల్యాణ్‌, చెల్లెళ్లు విజయ దుర్గా, మాధవిరావులతో కలిసి దిగిన ఓ ఫొటోని తాజాగా బండ్ల గణేష్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ ఫొటోలో ఉన్న పిల్లవాడే ఇప్పుడు తన దేవర అని బండ్ల గణేష్‌ వ్యాఖ్యానించారు.


హీరోలకు సుస్వాగతం..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, దేవయాని జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘సుస్వాగతం’. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 1997లో జరిగిన ఈ వేడుక ఫొటోలు ఇటీవల నెట్టింట్లో తళుక్కున మెరిశాయి.


సుల్తాన్‌ సెట్‌లో కుటుంబసభ్యులు..!

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన విభిన్న కథాచిత్రం ‘సుల్తాన్‌’. శరత్‌ రూపొందించిన ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో ఈ ముగ్గురు హీరోల కుటుంబసభ్యులు సెట్‌లో సందడి చేశారు. ఇటీవల ఈ ఫొటోని ఓ అభిమాని ట్విటర్‌లో షేర్‌ చేశారు.


మ్యాగజైన్‌ కవర్‌పై ఇలా..!

పవన్‌కల్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్‌ కోసం తన అన్నయ్య చిరంజీవితో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఒకే పరిశ్రమలో అన్నాతమ్ముళ్లు పనిచేయడంపై మన హీరోలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. 1997లో ప్రచూరింపబడిన ఈ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోని తాజాగా ఓ నెటిజన్‌ అందరితో పంచుకున్నారు.


ప్రపంచకప్‌తో పవన్‌కల్యాణ్‌..!

ఓ శీతలపానియాల సంస్థకు గతంలో పవన్‌ కొంతకాలంపాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రపంచకప్‌ని ఇలా ముద్దాడారు.


సినిమాల్లోకి రాకముందు.. వచ్చాక..!

నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు పవన్‌కల్యాణ్‌ చాలా అరుదుగా కెమెరా ముందుకు వచ్చేవారు. ఒకానొక సమయంలో చిరంజీవి సినిమా షూట్‌ చూసేందుకు సెట్‌లోకి వచ్చి వెనుకనే కూర్చొన్న పవన్‌కల్యాణ్‌. ఇందులో నటుడు నాగబాబు సైతం ఉన్నారు. అదే విధంగా ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో పవన్‌కల్యాణ్‌ లుక్‌కు సంబంధించిన ఓ ఫొటో సైతం నెట్టింట్లోకి వచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని