వైరల్ ట్వీట్‌పై నాలుగేళ్ల తర్వాత శ్రుతి రిప్లై
మీరనుకున్న విధంగా నేను అనలేదు: నటి
హైదరాబాద్: దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం తాను పెట్టిన ఓ వైరల్ ట్వీట్ గురించి ప్రముఖ నటి శ్రుతిహాసన్ తాజాగా స్పందించారు. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు. తాను ఇప్పట్లో కన్నడ సినిమా చేసే అవకాశాలు లేవంటూ 2017లో శ్రుతి పెట్టిన ట్వీట్ అప్పట్లో వైరల్‌గా మారింది. కన్నడ చిత్రపరిశ్రమ పట్ల ఆమెకు గౌరవం లేదని, అందుకే కన్నడ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారని అందరూ చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కన్నడ చిత్రదర్శకుడు ప్రశాంత్‌నీల్ రూపొందిస్తున్న ‘సలార్’లో నటించడం పట్ల పలువురు నెటిజన్లు.. ఆనాటి ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వరుస కామెంట్లు చేస్తున్నారు.
వీటిపై శ్రుతిహాసన్ స్పందించారు. ‘‘కన్నడ చిత్రపరిశ్రమలో భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ‘సలార్’ బృందం ఎంతో ప్రత్యేకమైనది. గతంలోనే నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే డేట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ‘సలార్’ విషయానికి వచ్చేసరికి కథ, పాత్ర నాకెంతో నచ్చింది. అలాగే ఈ చిత్రబృందం నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశాను. అన్ని భాషా చిత్రాల్లో నటించడం నాకెంతో ఆనందంగా ఉంది. 2017లో నేను చేసిన ఓ ట్వీట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతి ఇండస్ట్రీ, దర్శక నిర్మాతలు, నటీనటుల పట్ల నాకు గౌరవం ఉంది’’ అని నటి అన్నారు.
తెలుగు, తమిళ భాషలతోపాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేసిన ఈ నటి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
అనసూయ చిత్రం విడుదలకు సిద్ధం
గుసగుసలు
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!