Bigg Boss telugu 5: వల వలా ఏడ్చేసిన లోబో.. ఏం జరిగి ఉంటుంది? - telugu news bigg boss telugu 5 fourth week nominations promo
close
Updated : 27/09/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss telugu 5: వల వలా ఏడ్చేసిన లోబో.. ఏం జరిగి ఉంటుంది?

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5’ నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. గతవారం లాగే ఈసారి కూడా ఇంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు కాస్త గట్టిగానే జరిగాయి. ‘ఏదైనా అవకాశం దొరికితే దానికి తగ్గట్టు ప్లానింగ్‌ చేసి మాట్లాడొద్దు విశ్వ’ అని నటరాజ్‌ అనగా, ‘బయట మంచి యాక్టర్‌.. ఇక్కడ కూడా యాక్టింగ్‌ చేస్తున్నాడు’ అని చెప్పడానికి నువ్వు ఎవరు? అంటూ నటరాజ్‌పై విశ్వ మండిపడ్డాడు. ‘మనస్ఫూర్తిగా నా లవ్‌ గురించి చెబుతుంటే, సినిమా స్టోరీలా ఉంది’ అని ప్రియ అనడం నచ్చలేదని లోబో ఆమెను నామినేట్‌ చేశారు. ‘అప్పటికి నువ్వు స్టోరీ మొదలు పెట్టావు’ అని ప్రియ చెప్పే ప్రయత్నం చేయగా, ‘ఎవరు చెప్పారు’ అంటూ లోబో గట్టి గట్టిగా అరిచాడు. ‘మనసులో ఒకటి పెట్టుకుని, బయట ఒకటి మాట్లాడొద్దు లోబో’ అంటూ ప్రియ చెప్పింది. మరి ఈ వారం ఎంతమంది నామినేషన్స్‌లో ఉంటారు? ఎవర్ని ఎవరు నామినేట్‌ చేశారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని