‘నువ్వేకావాలి’ పాటల వెనుక కథ ఇది! - Music Director Koti Remembers the Blockbuster Movie Nuvve Kavali
close
Published : 10/10/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నువ్వేకావాలి’ పాటల వెనుక కథ ఇది!

నన్ను నేను ప్రూవ్‌ చేసుకున్న చిత్రం: సంగీత దర్శకుడు కోటి

ఇంటర్నెట్‌డెస్క్‌: తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘నువ్వే కావాలి’. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాల(అక్టోబరు 13)ను పూర్తి చేసుకోబోతోంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కోటి చెప్పిన ముచ్చట్లు...

‘‘నువ్వే కావాలి 20ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే, నాకు వయసు తగ్గిందా? కాలానికి వయసు పెరిగిందా? అర్థం కావటం లేదు. సినిమాను నిన్నే చేసినట్లు ఉంది. కాలం వేగంగా గడవటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులకు ధన్యవాదాలు చెప్పాలి. ఒకటి రామోజీరావు గారు, రెండు, స్రవంతి రవికిషోర్‌ గారు. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన చిన్న చిత్రం  అద్భుత విజయాన్ని అందుకుంది’’.

‘‘దర్శకుడిగా విజయ్‌ భాస్కర్‌, రచయితగా త్రివిక్రమ్‌ మంచి టీమ్‌. వాళ్లతో కలిసి పనిచేసే అవకాశం నాక్కూడా రావడం సంతోషం. నన్ను నేను ప్రూవ్‌ చేసుకున్న చిత్రమిది. మిలీనియం ఇయర్‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరికీ గుర్తుండిపోయే కొత్త మ్యూజిక్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ‘నువ్వేకావాలి’ చేశాం. అది విజయవంతమైంది. ముఖ్యంగా యూత్‌కు బాగా చేరువైంది’’

‘‘కాలేజ్‌లో ముఖ్యంగా కో-ఎడ్యుకేషన్‌లో ఫ్రెండ్‌షిప్‌ విలువను చెప్పే మంచి చిత్రం ‘నువ్వే కావాలి’. ప్రతి ఒక్కరి హృదయాలకు ఎంతో చేరువైంది. సింపుల్‌ సబ్జెట్‌ను చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు చాలా డిఫరెంట్‌గా సంగీతం అందించాలని 15రోజులు సమయం అడిగాను. ఒక్కడినే చెన్నై వెళ్లిపోయి ఒంటరిగా ట్యూన్స్‌ సిద్ధం చేసుకుని వచ్చాను. సిటింగ్స్‌లో కూర్చొంటే నేను వినిపించిన ఒక్క ట్యూన్‌ కూడా వాళ్లకు అర్థం కాలేదు. అంత అడ్వాన్స్డ్‌ ట్యూన్స్‌ ఇచ్చాను. వాళ్లు మెలోడీ పాటలు కావాలన్నారు. దీంతో మళ్లీ రెండు రోజులు కూర్చొని, ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే..’ ట్యూన్‌ వినిపించా. విజయ్ భాస్కర్‌, సవ్రంతి రవికిషోర్‌లకు బాగా నచ్చడంతో మిగిలిన పాటలను కూడా కంపోజ్‌ చేశా’’ అంటూ ‘నువ్వేకావాలి’ పాటల వెనుక అనేక విశేషాలను కోటి పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని