close
బాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మధ్యప్రదేశ్‌లో విద్య... చండీగఢ్‌లో వాణీ

ముంబయి: కరోనాకు భయపడుతూ కూర్చొంటే ముందుకెళ్లడం కష్టమని తారలు ఒక్కొక్కరికీ అర్థమవుతోంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూనే ధైర్యంగా సెట్లోకి అడుగు పెడుతున్నారు. హీరోలే కాదు హీరోయిన్‌లు ఈ  విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నారు. విదేశాల్లోనూ ఎలాంటి భయం లేకుండా చిత్రీకరణ చేయొచ్చు అనే భరోసా అందరిలోనూ కలిగించింది ‘బెల్‌బాటమ్‌’ చిత్రబృందం. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చిత్రీకరణ యూరప్‌లో ముగిసింది. ఇందులో వాణీకపూర్‌ నాయిక. అక్కడ షూటింగ్‌ అయిపోయాకా మరో చిత్రం కోసం సెట్లోకి వచ్చేసిందీ ఈ భామ. ఆయుష్మాన్‌ ఖురానా కథా  నాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. అభిషేక్‌ కపూర్‌ తెర కెక్కిస్తున్న ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టినట్టు ఫొటో పంచుకుంది వాణీ. ఈ సినిమా చిత్రీకరణ చండీగఢ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయుష్మాన్‌ మరింతగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. దీనికి ‘ఛండీగర్‌ కరే ఆషికీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.

ప్రముఖ నాయిక విద్యాబాలన్‌ కూడా దాదాపు 7 నెలల తర్వాత సెట్లోకి అడుగుపెట్టారు. ఆమె నటిస్తున్న కొత్త చిత్రం ‘షేర్నీ’. ఇది తిరిగి సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో చిత్రీకరిస్తున్నారు. అమిత్‌ మసూర్‌కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యా అటవీ అధికారిగా నటిస్తున్నారు. తిరిగి షూటింగ్‌ మొదలు పెడుతున్న సందర్భంగా చిన్న పూజా కార్యక్రమం నిర్వహించారు. అందులో అందరూ పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి కనిపించారు. విద్యా టీషర్ట్, జీన్స్‌ వేసుకొని మాస్క్‌ పెట్టుకుని పూజలో కూర్చొంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.