
ఇంటర్నెట్ డెస్క్: థ్రిల్లర్ సినిమాల నిపుణుడు కె.వి.గుహన్ దర్శకత్వంలో మరో క్రైమ్‌థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. కళ్యాణ్‌రామ్ హీరోగా ‘118’తో తెరకెక్కించి సత్తా నిరూపించుకున్నారాయన. ఈసారి సైబర్‌క్రైమ్ ఆధారంగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ(ఎవరు, ఎక్కడ, ఎందుకు) పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తాజాగా విడుదల చేశారు. టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ సాగిందిలా.. ‘‘నలుగురు స్నేహితులు సరదాగా వీడియోకాల్ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఊహించని అంతరాయం. ఎవరో వాళ్ల కాల్‌ను హ్యాక్ చేశారు. వాళ్ల పాస్వర్డ్లు, ఇతర సమాచారం మొత్తం లాగేసుకున్నారు. అందులో హీరోహీరోయిన్లు ఏకాంతంగా మాట్లాడుకున్న సంభాషణలు కూడా ఉన్నాయి. ఇది కచ్చితంగా బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటూ ఓ డైలాగ్.. ఇంతకీ ఆ అటాక్ చేసింది ఎవరు.? వాళ్లు ఉండేది ఎక్కడ..? అసలు ఎందుకు ఇలా చేశారు..? అనేదే కథాంశం. ఫస్ట్‌లుక్‌ను రానా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, రాజ్‌కుమార్ సతీష్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాను డా.రవి, పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. సిమన్ కె.కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఇదీ చదవండి..
భారీ బడ్జెట్‌తో ‘మణికర్ణిక’ సీక్వెల్
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- మహా నిర్లక్ష్యం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు